Wednesday, February 11, 2026
E-PAPER
Homeకరీంనగర్జిల్లా పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

జిల్లా పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

- Advertisement -

– జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 
నవతెలంగాణ-జగిత్యాల టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎస్పీ వివిధ ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారుల కు, సిబ్బందికి ఎస్పీ భద్రత పరమైన పలు సూచనలు చేశారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘు చందర్, ఇన్స్పెక్టర్ లు కరుణాకర్, రవి, ఎస్. ఐ లు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -