Wednesday, March 18, 2026
E-PAPER
Homeఖమ్మంఇఫ్తార్ విందులో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు 

- Advertisement -

– శాలువ కప్పి ఆహ్వానించిన మసీద్ కమిటీ
నవతెలంగాణ – అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక సౌహార్దానికి ప్రతీకగా నిలిచింది.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జూపల్లి రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విందు స్వీకరించారు.ముందుగా ఆయన్ను ముస్లిం సదర్ వలిపాషా,కమిటీ సభ్యులు శాలువ కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం పరస్పర సహనం, ప్రేమ, సేవా భావాలకు ప్రతీక అని పేర్కొన్నారు.మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి ముస్లింలు ఎంతో సహకరించారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానని అన్ని మతాల ప్రజలు కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజ ఐక్యతకు దోహదపడుతుందని అన్నారు.

ఈ ఇఫ్తార్ విందులో స్థానిక తహసిల్దార్ రామకృష్ణ , కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్,షేక్ ఫకీర్ నండ్రు రమేష్, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, యువకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగి సామాజిక సమగ్రతను చాటిచెప్పింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించి, అందరికీ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -