రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బిఎల్ టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్
నవతెలంగాణ- కంఠేశ్వర్
విధి నిర్వహణలో గుండె పోటుతో మున్సిపల్ కార్మికుడు ఘనపురం రామకృష్ణ మృతి చెందారు. ఆయన నగరంలోని ఆనంద్ నగర్ ప్రాంతానికి చెందినవారు. ఘనపురం రామకృష్ణ గత పది సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ శానిటేషన్ కార్మికుడిగా టాటా ఏసి వాహనంపై విధులు నిర్వహిస్తున్నడు. అక్టోబర్ 18 మధ్యాహ్నం సుమారు 2- 45 నిమిషాలకు నాగారం ప్రాంతంలోని డంపింగ్ యాడ్ లో చెత్తను ఖాలి చేసి వస్తూ వర్ని చౌరస్తాలో టాటా ఏసి వాహనంలో ఉండగానే చాతిలో నొప్పిగా ఉందని డ్రైవర్ నిలఖంఠంకు చెప్పాడు. అతను వెంటనే హాస్పిటల్ కు వెళ్లమని చెప్పాడు. దీంతో వాహనం దిగి అక్కడిక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వెంటనే వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఈ క్రమంలో అంబులెన్స్ లో ఒక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రికి వెళ్లాక అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు. మృతుడు రామకృష్ణకు భార్య అనుషా, 5 ఏండ్ల పాప నివేదిత ఉన్నారు.
రామకృష్ణ మృతి చెందిన విషయం తెలుసుకున్న మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్ టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మృతుడు రామకృష్ణ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు జి. గంగా శంకర్, ప్రధాన కార్యదర్శి పి. నవీన్ నాయకులు మోహన్ గౌడ్, రాకేష్ , స్వామి అబ్దుల్ ఖాదర్, విజయ్ మోతే, లక్ష్మి నారాయణ ఇతరులు కార్మికులకు పాల్గొన్నారు.