– అద్దె వాహనంతో అత్తను ఢకొీట్టించిన అల్లుడు
– గుర్తు తెలియని వాహనం ఢకొీట్టి
– మృతిచెందినట్టుగా కట్టు కథ
– పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి..
– వివరాలు వెల్లడించిన సీపీ బి.అనురాధ
నవతెలంగాణ-తొగుట : తన అప్పులు తీర్చుకునేందుకు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన అత్తమ్మనే హత్య చేయించాడు. ఆపై గుర్తు తెలియని వాహనం ఢకొీట్టడంతో ఆమె మృతిచెందినట్టు కట్టు కథ అల్లాడు. అయితే, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 7వ తేదీన జరిగిన మహిళ హత్య కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేటలో శనివారం విలేకర్ల సమావేశంలో సీపీ డాక్టర్ అనురాధ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పెద్దమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్ తన స్నేహితుడైన కరుణాకర్‌కు రూ.లక్షా 30వేలు అప్పుగా ఇచ్చాడు. అలాగే పౌల్ట్రీఫామ్, వ్యవసాయంలో మొత్తంగా రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో సిద్దిపేట పట్టణానికి చెందిన తన అత్తమ్మ తాటికొండ రామవ్వ(50)కు గత మార్చిలో పోస్ట్ ఆఫీస్‌లో రూ.755 చెల్లించి రూ.15లక్షల ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ బ్యాంకులో ఏడాదికి రూ.2 వేలు చెల్లించి రూ.40 లక్షల యాక్సిడెంట్ పాలసీ ఇన్సూరెన్స్ చేయించాడు. కాగా, తన అప్పులు తీరాలంటే అత్తమ్మను ఎలాగైనా హత్య చేయాలని.. ఆ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని పథకం వేశాడు. తన స్నేహితుడు కరుణాకర్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. ఆమెను హత్య చేస్తే తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, పైగా ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుందామని చెప్పాడు. దానికి అతడు ఒప్పుకున్నాడు. ఈనెల 7న ఉదయం 9.30 సమయంలో కరుణాకర్‌కు వెంకటేశ్ వాట్సప్ కాల్ చేసి.. తన అత్తమ్మను పెద్దమాసన్‌పల్లికి తీసుకొస్తానని, ఓ వాహనం తీసుకొని తుక్కాపూర్‌కు రమ్మని చెప్పాడు. దాంతో సిద్దిపేటలో టీఎస్ 18జి 2277 నెంబర్ గల థార్ వాహనాన్ని రోజుకు రూ.2500 కిరాయి చొప్పున తీసుకెళ్లాడు. ఆ కారు నెంబర్ ప్లేట్‌పై టీఆర్ స్టిక్కర్‌ను అతికించి తుక్కాపూర్‌కు వెళ్లాడు. తాను వచ్చిన విషయాన్ని వాట్సప్ కాల్ ద్వారా వెంకటేశ్‌కు చెప్పాడు. అత్తమ్మను తన వ్యవసాయ భూమి వద్ద రోడ్డుపై కూర్చోబెట్టి.. తాను పొలంలోకి వెళ్లినట్టు వెంకటేష్ తెలిపాడు. కారుతో ఆమెను ఢకొీట్టి హత్య చేయాలని కరుణాకర్‌కు సూచించాడు. దాంతో అతడు ఆమెను థార్‌తో ఢకొీట్టి హత్య చేశాడు. ఆ తర్వాత పని పూర్తి అయినట్టు వెంకటేష్‌కు వాట్సప్ కాల్ ద్వారా చెప్పాడు. నెంబర్ ప్లేటుపై గల స్టిక్కర్‌ను తొలగించి సిద్దిపేటలో ఓన్ డ్రైవింగ్ వారికి కారును అప్పగించాడు. అనంతరం గుర్తు తెలియని వాహనం ఢకొీని తన అత్తమ్మ చనిపోయినట్టు వెంకటేష్ తొగుట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రవికాంత్‌రావు, సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఉపయోగించి విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కీలకమైన కేసును గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో త్వరగా ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్‌ఐ రవికాంత్‌రావు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డ్ ఇచ్చారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES