నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ముర్షిదాబాద్ జరిగిన అల్లర్లు ఓ ప్లాన్ ప్రకారమే జరిగాయన్నారు. కుట్రపూరితమైన హింసలను తమ ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. తాజాగా సోమవారం ముర్షిదాబాద్‌లో సీఎం పర్యటించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఏలాంటి భేదాలు లేకుండా అన్ని మతాలను సమానంగా చూస్తామన్నారు. బెంగాల్‌లో డివైడ్ రూల్‌కు తావులేదని మమత పునరద్ఘాటించారు. మత ఆధారంగా ప్రజలపై దాడులు జరగడం సమంజసం కాదని, ఆ తరహా దాడులను తాను సహించనని చెప్పారు. వుమెన్ కమిషన్ ఒకరోజులోనే తమ రాష్ట్రానికి వచ్చిందని, కానీ మణిపూర్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించలేదని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఈ ఘటన వెనుక ఎవరూ ఉన్నారో తమకు తెలుసునని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. తాను ఎవరీకీ వ్యతిరేకం కాదని, ఈ తరహా అల్లర్లను ప్రోత్సహిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అదే విధంగా పలు రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీలపై దాడులు చేయడం సమంజసంకాదని హితువుపలికారు. కేంద్రం తెచ్చిన కొత్త వక్ఫ్ బోర్డు చట్టాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ముర్షిదాబాద్ అల్లర్లు ప్లాన్ ప్రకారమే జరిగాయి: సీఎం మమతా బెనర్జీ
- Advertisement -
- Advertisement -