15 రోజులు ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తాం
వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తాం
విలువైన సూచనలిచ్చిన వారితో ‘సబ్ కమిటీ’ సమావేశం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూసీ పునరుజ్జీవం పనులను ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం, మూసీ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మెన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మూసీ క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభా కర్తో కలిసి మూసీ పునరుజ్జీవం పనుల పురోగతిపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మూసీనది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ పనులకు మార్చి 28న శంకుస్థాపన చేశామని తెలిపారు. అప్పటి నుంచి మూసీ ఫేస్-1, ఫేస్-2 వరకు చేయాల్సిన పనులకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో ఎబరఱతీసషఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్ ఐడీ ద్వారా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపారు. ఆన్లైన్లో వచ్చిన విలువైన సలహాలు, సూచనలను వ్యక్తం చేసిన వారితో నేరుగా దశలవారీగా సబ్ కమిటీ సభ్యులు సంప్రదింపులు చేస్తారని తెలిపారు. డిఫెన్స్ భూములు, మూసీ బాధితులతో సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, బ్యాంకర్స్‌తో మాట్లాడటం ఇలా ఎక్కడికక్కడ పనులను విభజన చేసుకుని ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, యావత్ క్యాబినెట్ సంకల్పాన్ని అర్థం చేసుకుని అధికారులు ఉత్సాహంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అందరి జీవితాల్లో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతోందని సూచించారు. అధికారులకు ఎలాంటి సలహాలు, సూచనలతోపాటు ఏ ఇతర అవసరాలున్నప్పటికీ మూసీ సబ్ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ఆ కమిటీ సభ్యులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్డీ నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అధికారులు వినరు కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మనుచౌదరి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో మూసీ పునరుజ్జీవం పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



