Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమ‌స్క్ విమ‌ర్శలు..ట్రంప్ హ‌ర్షం

మ‌స్క్ విమ‌ర్శలు..ట్రంప్ హ‌ర్షం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బిగ్‌ బ్యూటిఫుల్ బిల్‌తో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేతల మధ్య దూరం పెరిగిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో పరస్పరం తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం చెందుతున్నట్లు మస్క్‌ పోస్టు పెట్టడంతో వివాదం ముగిసింది. తాజాగా ఆ బిల్ పై మ‌స్క్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. దేశానికి అపారమైన హాని కలిగిస్తుందన్నారు. ఇది ఒక విధ్వంసకర చర్య అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్‌ల రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందని తెలిపారు.

మ‌రోవైపు ట్రంప్ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ ఓటింగ్‌లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. ఈక్రమంలో డెమోక్రట్లందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇక సెనెట్‌లో బిల్లుకు ఆమోదం లభించడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప విజయమని ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు. బిల్లుకు ఆమోదం తెలిపిన రిపబ్లికన్‌లకు ధన్యవాదాలు తెలిపారు, వారు లేకపోతే ఇది సాధ్యం కాదన్నారు. వారు నిజంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తులని, అమెరికా అధ్యక్షుడిగా తనకు ఇప్పుడు గర్వంగా ఉందన్నారు. ఇది తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు, వృథా ఖర్చులను తగ్గించడానికి, సరిహద్దు భద్రతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -