Sunday, July 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం అమెరికాలో మస్క్‌ కొత్త రాజకీయ పార్టీ..

 అమెరికాలో మస్క్‌ కొత్త రాజకీయ పార్టీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అగ్రరాజ్యం అమెరికాలో మరో కొత్త పార్టీ అవతరించింది. రిపబ్లికన్‌, డెమొక్రాట్లకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. ట్రంప్‌ కలల బిల్లు అయిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ను ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాట్లు చేస్తానని మస్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ట్రంప్‌ ఆ బిల్లుపై సంతకం చేయడం, అది చట్టం రూపం దాల్చడం జరిగిపోయాయి. దీంతో ‘ది అమెరికా పార్టీ’ ని (The America Party) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది’ అని పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన మస్క్‌, ఎక్స్‌ వినియోగదారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ఈ నీర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -