టెక్సాస్: టెక్సాస్‌లోని ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థలో భారీ పేలుడు జరిగింది. ఈ సంస్థకు చెందిన స్టార్‌షిప్ రాకెట్ పరిక్షిస్తున్న సమయంలో పేలిపోయినట్లు అధికారులు గురువారం తెలిపారు. షిప్‌ను కీలకమైన ఫైర్ టెస్ట్ కోసం షెడ్యూల్ చేయడానికి ముందు ఈ ఘటన జరిగింది. ఈ పేలుడుతో స్టార్‌షిప్ నమూనాకి తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో స్పేస్ ఎక్స్ అన్ని ప్రయోగాలు నిలిపివేసినట్లు సంస్థ ప్రకటించింది. స్పేస్ఎక్స్ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం టెక్సాస్‌లోని పరీక్ష కేంద్రం వద్ద పరిక్షించేందుకు సిద్దంగా ఉన్న స్టార్‌షిప్ పరిశీలన దశలోనే పేలిపోయిందని స్పేస్ఎక్స్ స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని,స్థానిక అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని స్పేస్ఎక్స్ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో రెండు స్టార్‌షిప్ టెస్ట్ రాకెట్లు ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయిన సంగతి తెలిసిందే. ఒక వాహనం కరేబియన్ మీదుగా పేలిపోగా, మరొకటి అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా వీడిపోయే ముందు నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటనలపై ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తుకు ఆదేశిం చడంతో పాటు తాత్కాలికంగా గగనతలాన్ని మూసివేసింది.
మస్క్ స్పేస్ ఎక్స్‌లో పేలిపోయిన స్టార్‌షిప్ రాకెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES