Tuesday, September 16, 2025
E-PAPER
Homeసినిమాభిన్న కాన్సెప్ట్‌తో 'మటన్‌ సూప్‌'

భిన్న కాన్సెప్ట్‌తో ‘మటన్‌ సూప్‌’

- Advertisement -

రమణ్‌, వర్షా విశ్వనాథ్‌ హీరో, హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్‌ సూప్‌’. ‘విట్‌నెస్‌ ది రియల్‌ క్రైమ్‌’ ట్యాగ్‌ లైన్‌.
రామకష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు బ్యానర్లపై మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌), అరుణ్‌ చంద్ర వట్టికూటి, రామకష్ణ సనపల నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా నుంచి ‘హర హర శంకర’ సాంగ్‌ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. ‘హర హర శంకర’ పాటలో సమాజంలో జరుగుతున్న ఘోరాల్ని చూపించారు’ అని తెలిపారు.
‘నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌), అరుణ్‌ చంద్ర వట్టికూటి, రామకష్ణ సనపల, పర్వతనేని రాంబాబు, శివకి థ్యాంక్స్‌. త్వరలోనే మా చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇస్తాం. సెప్టెంబర్‌లో మూవీని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని దర్శకుడు రామచంద్ర వట్టికూటి అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ, ”తనికెళ్ల భరణి మా పాటను లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడే మేం విజయం సాధించినట్టుగా భావిస్తున్నాం. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
‘ఓ భిన్న కాన్సెప్ట్‌తో వస్తున్నాం. తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’ అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పర్వతనేని రాంబాబు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -