Thursday, March 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నా పోరాటం ముగ్గురిపైనే..కవిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నా పోరాటం ముగ్గురిపైనే..కవిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన రాజకీయ అజెండాను స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తన పోరాటం ఎవరితోనో కాదని.. “డాడీ (కేసీఆర్), మోడీ (పీఎం నరేంద్ర మోడీ), చిన్నమోడీ (కేటీఆర్)” లపైనేనని ఆమె సంచలన ప్రకటన చేశారు.

బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అంతర్గత విభేదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు కవిత మండిపడ్డారు. తన రాజకీయ ప్రయాణం స్వతంత్రంగా ఉంటుందని, ఎవరికీ అడ్వాంటేజ్‌గా మారబోనని ఆమె స్పష్టం చేశారు. “మంచి ముహూర్తం చూసుకుని పార్టీని ప్రారంభిస్తా.. అప్పుడే నా లక్ష్యాలను ప్రజల ముందు ఉంచుతాను” అని ఆమె అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -