Monday, July 7, 2025
E-PAPER
Homeఖమ్మంలక్ష మొక్కలు నాటడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే

లక్ష మొక్కలు నాటడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే

- Advertisement -

ఎకో పార్క్ త్వరలో ఏర్పాటు…
వనమహోత్సవంలో ఎమ్మెల్యే జారే..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: నియోజక వర్గం వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అని, మంగళవారం నా పుట్టినరోజు సందర్భంగా కేక్ లు, శాలువాలకు ఖర్చు చేయకుండా అభిమానులు మొక్కలు నాటాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటితే  రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఆయన మునగ మొక్కను నాటి వన మహోత్సవం – 2025 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

అటవీ శాఖ ఆద్వర్యంలో, నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ నుంచి స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి వరకు విద్యాశాఖ నిర్వహించిన ర్యాలీలో సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. కూడలిలోని వివేకానంద విగ్రహం చుట్టూ విద్యార్ధులు, అధికారులతో మానవ హారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు.

అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేట లోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం అనుకుని ఉన్న 25 ఎకరాల్లో నగర వన్ యోజన పధకంలో భాగంగా “ఎకో పార్క్” ను రూ.2 కోట్లు తో నిర్మించనున్నట్లు తెలిపారు. అందులో పక్షులు,జంతువులు,చిన్న పిల్లలు కోసం ఆటలు సామాగ్రి ఏర్పాటు చేస్తామని అన్నారు. మినీ స్టేడియం త్వరలో నిర్మాణం చేపడతామని తెలిపారు. మనం చెట్టును కాపాడితే, చెట్టు మనల్ని కాపాడుతుందని, 33 శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం 13 శాతానికి తగ్గిపోయిందని తిరిగి అడవిని పునరుద్ధరించాలని తెలిపారు.

కార్యక్రమంలో డీసీ ఎఫ్, పాల్వంచ డీఎఫ్ఓ కే.దామోదర్ రెడ్డి, అశ్వారావుపేట, దమ్మపేట ఎఫ్ఆర్ఓ లు మురళీ, శ్రీనివాసరావు, తహశీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, మండల పరిషత్ ప్రత్యేక అధికారి పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ప్రదీప్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అశ్వారావుపేట( బాలురు), అశ్వారావుపేట( బాలికలు), ఏజీహెచ్ఎస్ అశ్వారావుపేట ప్రధానోపాధ్యాయులు పి.హరిత,ఎన్.కొండలరావు, భావ్ సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముస్లిం మైనార్టీ గురుకులం జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు అల్లు అనిత, తూము సంగీత, సీఐ నాగరాజు రెడ్డి, అదనపు ఎస్ఐ వీ.రామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, తగరం ముత్తయ్య, కానూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -