చోల్లేడు గ్రామ సర్పంచ్ కదిరె లింగయ్య యాదవ్
నవతెలంగాణ – మునుగోడు
చోల్లేడు గ్రామంలోని ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే తమ లక్ష్యమని చోల్లేడు గ్రామ సర్పంచ్ కదిరె లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం ఆ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను , రైతులను విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గ్రామంలో విద్యుత్ లూజు లైన్ లు , నూతన స్తంభాల ఏర్పాటు స్థలాలను పరిశీలించారు. గ్రామంలో తక్షణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
సమస్య పెద్దదైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో లూజ్ లైన్లో సమస్యను, నూతన స్తంభాల ఏర్పాటు సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వనం అమరావతి ప్రసాద్, గ్రామ కార్యదర్శి పుష్ప, మాజీ సర్పంచ్ జనిగల మహేశ్వరి సైదులు, వార్డు సభ్యులు ప్రసాద్, స్వామి, రవి, వి విజయ్, బి శివకుమార్, పి సరిత రమేష్, జె విజయలక్ష్మి స్వామి, బొడ్డు స్వామి, మద్ది పారిజాత లింగయ్య, గ్రామ ప్రజలు వనం యాదయ్య, వనంం వెంకన్న, జి సాగర్ రెడ్డి, మద్ది పరమేష్, మండల విద్యుత్ శాఖ ఏ ఈ, లైన్మెన్, హెల్పర్స్ తదితరులున్నారు.



