శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడమే నా లక్ష్యం అని ఆ గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ అన్నాడు. శుక్రవారం ఆ గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేసవి కాలంలో మండుటెండలు విపరీతంగా కొట్టడంతో ప్రజల వివిధ రకాల పనుల నిమిత్తం బయటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు దాహంతో ప్రజలు అల్లాడుతున్నారని అలా ప్రజలు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో చల్లటి నీరును అందించేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.
తీవ్రమైన ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, బాటసారులు, కూలీలు, రైతులు మరియు వృద్ధులు వంటి వారికి ఉచితంగా మినరల్ త్రాగునీరు గ్రామపంచాయతీ నుండి అందిస్తున్నాము అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్, సి సి ఈ పద్మ, జిపిఓ విజయ్ కుమార్, గ్రామ వివో ఏ లు శ్రీనివాస్, విజయలక్ష్మి,గ్రామస్థులు డోనికాని ఉప్పమ్మ, శీలం సంధ్య, నిలరాపు యాకంభ్రం,కల్పన సిబ్బంది రామగిరి ఉప్పలయ్య, బందు వెంకన్న, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.



