Friday, May 23, 2025
Homeజాతీయంమైసూర్‘పాక్’ పోయి ‘శ్రీ’ వ‌చ్చే..!

మైసూర్‘పాక్’ పోయి ‘శ్రీ’ వ‌చ్చే..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో భార‌త్-పాక్ మ‌ధ్య ఉద్రిక‌త్తలు పెరిగిపోయి..ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ఆదేశానికి చెందిన పేర్లుతో ఉన్న ప్రాంతాలపై, సంస్థ‌ల‌పై, ప‌లు దుకాణాల‌పై భార‌తీయుల త‌మ అసంతృప్తిని వెలిబుచ్చారు.ఈ సమయంలో నెట్టింట మైసూర్‌పాక్‌ పేరును మార్చాలని కొందరు సోషల్‌మీడియాలో ప్రతిపాదనలు చేశారు.

రాజస్థాన్‌లోని జైపుర్‌లో గల ప్రముఖ ‘త్యోహార్‌ స్వీట్స్‌’ యజమాని ఈమేరకు తమ దుకాణంలో మార్పులు చేశారు. మైసూర్‌ పాక్‌తో పాటు.. మోతీ పాక్‌, ఆమ్‌ పాక్‌, గోండ్‌ పాక్‌ పేర్లను మార్చి.. మైసూర్‌ శ్రీ, మోతీ శ్రీ, ఆమ్‌ శ్రీ, గోండ్‌ శ్రీ అని కొత్త పేర్లు పెట్టారు. స్వర్ణ భాషం పాక్‌, చాందీ భాషమ్‌ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు. దీనిపై ఆ దుకాణం యజమాని అంజలీ జైన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు. ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -