మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జరు వల్లందాస్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ,’ఒక కొత్త స్క్రీన్‌ప్లేతో పూర్తిగా సస్పెన్స్‌తో ఉన్న ఈ థ్రిల్లర్ ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికిలోను చేస్తుంది’ అని తెలిపారు. ‘ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్స్‌లో విడుదల చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని నిర్మాత జరు వల్లందాస్ చెప్పారు.
సహ నిర్మాతలు ఉషా, శివానీ మాట్లాడుతూ, ‘సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రోహిత్, మేఘన రాజపుట్, అభిద్ భూషణ్, రియా కపూర్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ నవీన్, లక్కీ ఇందులో ప్రధాన భూమికను పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి.
‘మిస్టీరియస్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -



