Thursday, February 5, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్చ‌ర్ల‌ప‌ల్లి మ‌హిళ ఆత్మ‌హ‌త్య కేసులో వీడ‌ని మిస్ట‌రీ..!

చ‌ర్ల‌ప‌ల్లి మ‌హిళ ఆత్మ‌హ‌త్య కేసులో వీడ‌ని మిస్ట‌రీ..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైద‌రాబాద్ లోని చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ స‌మీపంలో.. గ‌త నెల ట్రైన్ కింద‌ప‌డి పిన్నింటి విజయశాంతిరెడ్డి అనే స్టాప్ట్‌వేర్ ఉద్యోగిని.. త‌న టీనేజ్ పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. రోజుల గ‌డుస్తున్న సూసైడ్ వెనుక ఉన్న మిస్ట‌రీ వీడ‌డం లేదు. అనేక కోణాల్లో కేసును రైల్వే పోలీసులు సోదిస్తున్న ఎలాంటి క్లూ ద‌ర్యాప్తు బృందానికి ల‌భించ‌డంలేదు. ప్ర‌స్తుతం ఆమె ఉన్న‌ కాల‌నీతో పాటు ఆమె ప‌ని చేస్తున్న కార్యాల‌య సిబ్బందిని, తోటీ ఉద్యోగుల‌ను, పిల్ల‌ల కాలేజ్‌ల్లో సుమారు 200మందిపైగా పోలీసులు వాక‌బు చేసి విచార‌ణ చేప‌ట్టారు. అయినా కానీ ఆత్మ‌హ‌త్యకు ప్రేరేపించిన కార‌ణాలు ల‌భించ‌క‌పోవ‌డంతో ద‌ర్యాప్తు బృందానికి నిరాశ ఎదురైంది.

ఘటన రోజు ఆమె ఇంటి దగ్గరి నుంచి ఇరువురు పిల్లల కళాశాలలు తిరిగి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ చేరుకునే వరకు 100 సీసీ కెమెరా పుటేజీలను తెప్పించి పరిశీలించారు. అన్ని వీడియోల్లో ఆమె, త‌న ఇద్ద‌రు పిల్ల‌లు త‌ప్పా మరెవ్వ రితోనూ కలిసిన దాఖలాలు కనిపించలేదు.అయితే ఆమె వాడిన సెల్‌ఫోన్, లాప్ ట్యాప్‌ల‌ను పోరెన్సిక్ ల్యాబ్‌కు జీపీ పోలీసులు పంపారు. దీంతో వాటిలో ఉన్న స‌మాచారం ఆధారంగా హ‌త్య వెనుక ఉన్న మిస్ట‌రీ వీడ‌నుంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

కాగా,గత నెల 27న కూతురు చైతన్యరెడ్డిని విజయశాంతిరెడ్డి (Vijayashanti Reddy) పటాన్‌చెరు హాస్టల్‌ నుంచి ఔటింగ్‌ తీసుకొచ్చారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం 29న తిరిగి హాస్టల్‌లో డ్రాప్‌ చేసి వచ్చారు. 30న రాత్రి 8 గంటల ప్రాంతంలో కుమారుడిని వెంట తీసుకుని మళ్లీ ఔటింగ్‌ కావాలని చైతన్యరెడ్డి హాస్టల్‌కు వెళ్లారు. ఒక్క రోజులోనే మళ్లీ ఔటింగ్‌ ఎందుకని హాస్టల్‌ నిర్వాహకులు ప్రశ్నించగా.. బంధువు చనిపోయారని చెప్పారు. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -