- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.
- Advertisement -



