Saturday, July 26, 2025
E-PAPER
Homeఆటలువారియర్స్‌ కోచ్‌గా నాయర్‌

వారియర్స్‌ కోచ్‌గా నాయర్‌

- Advertisement -

డబ్ల్యూపీఎల్‌ ప్రాంఛైజీ ప్రకటన
ముంబయి :
భారత మాజీ ఆల్‌రౌండర్‌, భారత జట్టు మాజీ సహాయక కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు సైతం సహాయక కోచ్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్‌ నాయర్‌ 2026 డబ్ల్యూపీఎల్‌ సీజన్‌ నుంచి యూపీ వారియర్స్‌కు చీఫ్‌ కోచ్‌గా పని చేయనున్నాడు. జాన్‌ లెవిస్‌ స్థానంలో యూపీ వారియర్స్‌ శిక్షణ సారథ్య పగ్గాలను అభిషేక్‌ అందుకోనున్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 2022 సీజన్‌కు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ (టీకెఆర్‌) హెడ్‌ కోచ్‌గా పని చేసిన అభిషేక్‌.. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -