- Advertisement -
నవతెలంగాణ-క్లాక్‌టవర్
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫేస్‌బుక్ ఐడీ హ్యాక్‌కు గురైంది. ”నా స్నేహితుడు సంతోష్ కుమార్ సీఆర్పీఎఫ్ అధికారి బదిలీ అయ్యాడు. ఆయన ఇంట్లోని పాత ఫర్నిచర్ సెకండ్ హ్యాండ్‌గా అమ్ముతున్నాడు. అన్ని వస్తువులు బాగున్నాయి. ధర చాలా చౌకగా ఉంది.. మీకు నచ్చితే తీసుకోవచ్చు” అంటూ ఫేస్‌బుక్‌లో సైబర్ నేరగాళ్లు ఆమె పేరిట పలువురికి మెసేజ్‌లు పంపించారు. కాగా, ఈ విషయాన్ని కలెక్టరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. తమకు ఆ ఫేస్‌బుక్ ఐడీతో సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.
- Advertisement -