- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంగతి విదితమే. ఘటనకు సంబంధించి ఆడియో కాల్ వెలుగులోకి వచ్చింది. చనిపోయేముందు స్నేహితుడితో ఇంతియాజ్ అనే వ్యక్తి మాట్లాడారు. సెల్లార్‌లో చిక్కుకుపోయామని, బయటకు వచ్చే మార్గం కనబడటం లేదని ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని, తమను ఎలాగైనా కాపాడాలని వేడుకున్నారు. రెండో సెల్లార్‌కు వెళ్లాలని ఇంతియాజ్‌కు స్నేహితుడు సూచించారు. ఏమీ కనిపించడం లేదని స్నేహితుడితో ఇంతియాజ్ వాపోయారు.
- Advertisement -



