Saturday, May 3, 2025
Homeట్రెండింగ్ న్యూస్‘హిట్ 3’ తొలి రోజు క‌లెక్ష‌న్స్.. 

‘హిట్ 3’ తొలి రోజు క‌లెక్ష‌న్స్.. 

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. హిట్ సిరీస్‌లో భాగంగా మూడో చిత్రంగా రూపుదిద్దుకుంది. శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం గురువారం (మే 1) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.
తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఈ చిత్రం తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 43 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో అధికారికంగా తెలియ‌జేసింది. ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను సైతం విడుద‌ల చేసింది. నాని కెరీర్‌లోనే మొద‌టి రోజు అత్య‌ధిక వ‌సూళ్లను సాధించిన చిత్రంగా హిట్ 3 నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img