– ఎర్రజెండా పట్ల అత్యంత విశ్వాసం ఉన్న నాయకుడు
– ఆయన మరణం పార్టీకి తీరని లోటు
– వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్.
నవతెలంగాణ న్యూఢిల్లీ:
ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు నర్రా రమేష్ ఆకస్మికమరణం దిగ్భ్రాంతి కల్గించిందని వ్యవసాయ కార్మిక సంఘం ఆలింండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ‘నేను ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ఖమ్మం నగరంలో అత్యంత క్రియాశీలకంగా పని చేశాడు. చిన్ననాటి నుండి విద్యార్ధి, ప్రజా ఉద్యమాలలో కలసి పని చేశాము. చిన్న వయసులోనే మరణించడం భాదకల్గించింది.` అని నర్రా రమేష్ కు విప్లవ జోహర్లు తెలియజేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెంకట్ మాట్లాడుతూ…ఖమ్మం జిల్లాలో విద్యార్ధి ఉద్యమం, ఎర్రజెండా స్ఫూర్తితో వచ్చిన నర్రా రమేష్ కడ వరకు అదే ఎర్రజెండాను అంటిపెట్టుకుని పని చేశారని గుర్తుచేశారు. ఖమ్మం పట్టణంలో కౌన్సిలర్ గా ప్రజా సమస్యలను పరిష్కారానికి పని చేశారని తెలిపారు. నర్రా రమేష్ కుటుంబంతో కూడా తనకు అనుబంధం ఉందని తెలిపారు. రమేష్ కుటుంబం యావత్తూ పార్టీ పై నిబద్ధత, విశ్వాసం ఉంది. మిలిటెన్సీ, మంచి వాగ్ధాటి కల్గిన నేతను కొల్పోవడం బాధ కల్గిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి పనిచేసినప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానం, గుర్తింపును సంపాదించుకున్న మంచి వ్యక్తి నర్రా రమేష్ అని అన్నారు. నర్రా రమేష్ మరణం వ్యక్తిగతంగా నాకు, పార్టీకి తీరని లోటని తెలిపారు.