- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో సోమవారం గణిత శాస్త్ర నిపుణులు శ్రీనివాస రామానుజన్ జన్మ దినోత్సవం సందర్భంగా జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల గణితం కు సంబంధించిన ప్రదర్శనాలు నిర్వహించారు. ముఖ్యంగా రూబిక్స్ క్యూబ్, సూడోకూ మరియు క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ బృంధంతో పాటు పాఠశాల డైరెక్టర్ విగ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్,ప్రిన్సిపాల్ విజయకర్తన్ పాల్గొన్నారు.
- Advertisement -



