Wednesday, January 7, 2026
E-PAPER
HomeNewsరాఘవేంద్ర లిటిల్ హన్స్ స్కూల్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం

రాఘవేంద్ర లిటిల్ హన్స్ స్కూల్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం

- Advertisement -

నవతెలంగాణ జన్నారం

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2026 సందర్భంగా మంచిర్యాల మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ కిషోర్ చంద్ర విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోకిషోర్ చంద్ర మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పక సీటు బెల్టు, హెల్మెట్ లను ధరించాలని, వాహనాలకి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని కోరారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతిరోజూ బయటికి వెళ్ళేప్పుడు బండి కండిషన్ చూసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులకి అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ ఎర్ర చంద్ర శేఖర్, రాఘవేంద్ర విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎర్ర సంపత్, రాఘవేంద్ర లిటిల్ హన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, డీన్ హేమలత షిండే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -