Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం

టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్‌పి హెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ (టీఎస్ యుటిఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యానంద్ మాట్లాడుతూ మహిళా హక్కులు సంపూర్ణ స్థాయిలో అమలైనప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. సమాజంలో ప్రతి పురుషుడు తన వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకువచ్చి భార్యలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

అలా మారినప్పుడే మహిళలు నిజమైన హక్కులను పొందగలుగుతారని పేర్కొన్నారు. మహిళ శ్రామిక జిల్లా కన్వీనర్ రేణుక మాట్లాడుతూ సమాజంలో మహిళలపై ఉన్న వివక్ష పూర్తిగా తొలగిపోలేదని, మహిళలు చదువు, ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు మాట్లాడుతూ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ల నిరంతర కృషి వల్లనే భారతదేశంలో విద్యాభివృద్ధికి బాటలు పడినట్లు తెలిపారు. 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్త్రీవిద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని, మహిళా హక్కుల కోసం రూపొందించిన హిందూ కోడ్ బిల్లు విషయమై న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే బాలికలపై వివక్షను అరికట్టేలా చట్టాలు రావాలని, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు రూప్‌సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యవహరించినప్పుడే అందరి హక్కులు కాపాడబడతాయని, స్వార్థం పెరిగినప్పుడు ఇతరుల హక్కులు నశించే ప్రమాదం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో వనిత రెడ్డి (గురుకుల ప్రిన్సిపాల్), స్వప్న, ఇర్ఫాన్ బాను, గంగా జ్యోతి, సంధ్య, యశోద బాయి, రాణి, సునీత, వసంత, రమ్యశ్రీ, వెన్నెల, సాయి గౌతమ్, బాలయ్య, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -