- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సోమవారం గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె ప్రారంభమైంది. మెరుగైన వేతనాలు, ఇన్సెంటివ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవర్, PF/ESIC, పెన్షన్, 10 నిమిషాల డెలివరీ మోడల్ రద్దు, అన్యాయ ఐడీ బ్లాకింగ్, పోలీస్ వేధింపుల ముగింపు వంటి డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్లు యూనియన్ తెలిపింది. సమ్మెలో భాగంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల నుంచి లాగౌట్ అవుతూ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలకు అంతరాయం కలగనుంది.
- Advertisement -



