Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్తాడ్వాయిలో నవతెలంగాణ జిల్లా విలేకరుల సమావేశం 

తాడ్వాయిలో నవతెలంగాణ జిల్లా విలేకరుల సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
మండల కేంద్రంలో నవతెలంగాణ ములుగు జిల్లా విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథితులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ దేవేందర్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బీ రెడ్డి సాంబశివ లు హాజరై మాట్లాడారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా తాడ్వాయి నవతెలంగాణ విలేకరి తమ్మల సమ్మయ్య గౌడ్ వ్యవహరించారు. మొదట నవ తెలంగాణ విలేకరుల వార్తకథనాలు, ‌ రాజకీయ వార్తలు, భవిష్యత్తు కర్తవ్యాలు, ఆర్థికపరమైన అంశాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ, పరిష్కార మార్గంగా ఎప్పటికప్పుడు ఉండాలని సూచించారు.నవతెలంగాణ దినపత్రిక పేదల పెన్నిధి అని, అను దినం ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా డెస్క్ ఇంచార్జ్ క్రాంతి, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పిట్టల మధుసూదన్, జిల్లా ఇన్చార్జి ఎండి గౌస్ పాషా, 9 మండలాల విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -