- Advertisement -
– అభినందించిన పాఠశాల యాజమాన్యం
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని భూక్య శాన్వి 69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కబడ్డీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆడి మొదటి బహుమతిని సాధించింది.
అంతే కాకుండ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కబడ్డీ స్టేట్ లెవల్ కి ఎంపికైనందున పాఠశాల కరస్పాండెంట్ గంగర వేణి రవి మంగళవారం పాఠశాలలో విద్యార్థిని భూక్య శాన్వి ని ఘనంగా సన్మానించారు. కబడ్డీలో స్టేట్ మీట్ నుండి నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ రవి తెలిపారు.
- Advertisement -