నవతెలంగాణ -హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఎన్డేయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజార్జీతో విక్టరీ సాధించారు. రాధాకృష్ణన్‌కు 452, ఇండియా బ్లాక్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మొత్తం 781ఓట్లకు గాను మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. ఎన్డేయే బలం 427 కాగా.. క్రాస్ ఓటింగ్ జరగడంతో 452 ఓట్లు వచ్చాయి. దీంతో దేశంలోని 17వ ఉపరాష్ట్రపతిగా సీసీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అదే విధంగా ఆప్, ఆర్జేడీకి చెందిన ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఇండియా కూటమి అభ్యర్థికి ఆప్, ఆర్జేడీ మద్దతు తెలిపినప్పటికీ..ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్, అలాగే ఆర్జేడీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ ఎన్డీయే కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. ఇక బీఆర్ఎస్, బీజేడీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. అలాగే పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ (SAD) కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలావుండగా లోక్‌సభలో 543 మంది ఎంపీలు ఉండగా.. రాజ్యసభలో 233 మంది సభ్యులు ఉన్నారు. ఇక 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉండగా.. 5 రాజ్యసభ, 1 లోక్‌సభ స్థానం ఖాళీగా ఉంది. 781ఓట్లకు గాను మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే జగదీశ్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది.