నవతెలంగాణ-హైదరాబాద్: స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను నీరజ్ చోప్రాకు కేంద్ర రక్షణ మంత్రి రాజానాథ్ సింగ్, ఆర్మీ చీప్ జనరల్ ఉపేంద్ర దివ్వేది ప్రదానం చేశారు.
నీరజ్ చోప్రాకు గతంలో పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న , అర్జున అవార్డులు దక్కాయి. పరమ విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ కూడా ఆయన గెలుచుకున్నారు. 2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2024 పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించాడు. 2023 వరల్డ్ అథ్లటిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాడు. ఏషియన్, కామన్‌వెల్త్ గేమ్స్‌తో పాటు డైమండ్ లీగ్‌ల్లోనూ అతను స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు.