Friday, October 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం1500మందికి పైగా పర్యాటకులను ర‌క్షించాం: నేపాల్‌ భద్రతా దళం

1500మందికి పైగా పర్యాటకులను ర‌క్షించాం: నేపాల్‌ భద్రతా దళం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారీ హిమపాతం కారణంగా మనాంగ్‌లో చిక్కుకుపోయిన 1500మందికి పైగా పర్యాటకులను రక్షించినట్లు నేపాల్‌ భద్రతా దళం పేర్కొంది. 4,919 మీటర్ల ఎత్తులో టిలిచో సరస్సువైపు ట్రెక్కింగ్‌కి వెళుతున్న పర్యాటకులు.. అనుకూల వాతావరణంతో బేస్‌ క్యాంప్‌ చేరుకునేందుకు వెనుతిరిగినట్లు నేపాల్‌ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

మనాంగ్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 200మందికి పైగా విదేశీ పర్యాటకులు సహా సుమారు 1500 మంది చిక్కుకుపోయారని, న్యూబైరవిడల్‌ గుల్మ్‌ నుండి మోహరించిన సహాయక బృందం, నేపాల్‌ పోలీసులు,స్థానికుల సహాయంతో సురక్షిత ప్రాంతానికి చేర్చినట్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొంది. ఎత్తైన ప్రాంతాల్లో భారీ హిమపాతంతో సుమారు వెయ్యిమంది పర్యాటకులు ఖంగ్సర్‌కు చేరుకున్నారని నిస్యాంగ్‌ గ్రామీణ మునిసిపాలిటీ తెలిపింది. ఇది టిలిచో సరస్సు ముందు ఉన్న చివరి స్థావరమని పేర్కొంది.

మంచు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ట్రెక్కింగ్‌ను కూడా రద్దు చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు మనాంగ్‌ జిల్లా యంత్రాంగం తెలిపింది. గత రెండు రోజుల్లో సుమారు 800 నుండి 900మంది పర్యాటకులు టిలిచో బేస్‌ క్యాంప్‌ నుండి వెనక్కి మళ్లినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -