Tuesday, October 21, 2025
E-PAPER
Homeనల్లగొండనేర్మట-బంగారిగడ్డ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి

నేర్మట-బంగారిగడ్డ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలి

- Advertisement -
  • సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నవతెలంగాణ-చండూరు: మండలంలో నేర్మట నుండి బంగారిగడ్డ రోడ్డును బీటి రోడ్డుగా మార్చాలని, ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం నేర్మట నుండి బంగారిగడ్డకు పోయే మట్టిరోడును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోడ్డు వెంట నడవాలంటే ప్రజలకు, రైతులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ రోడ్డును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని అమలు చేయాలని, ఇప్పటికే ఈ రోడ్డుకు ప్రపోజల్ ప్రభుత్వానికి పంపారని, వెంటనే ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతూ విధ్వంస పాలన కొనసాగిస్తుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం వలన గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృథం చేస్తామ‌ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఈరటి వెంకటయ్య, బి.స్వామి, నారాపాక శంకరయ్య, లింగస్వామి, కొత్తపల్లి వెంకన్న, నరసింహ, వెంకటయ్య, స్వామి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -