నవతెలంగాణ-హైదరాబాద్ : గాజాను పూర్తిగా ఆక్రమించుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. గాజా ప్రజలు ఆహారం దొరక్క ఓవైపు వరుస దాడులతో మరోవైపు అల్లాడిపోతున్నారు. ఇక తాజాగా గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని ఓ వీడియోను విడుదల చేశారు. నేత న్యాహు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ… దౌత్య కారణాలకు లోబడి గాజలో కరువును నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని ఆయన అన్నారు. తమ పోరాటం తీవ్రస్థాయిలో ఉందని, పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని నేతన్యాహు స్పష్టం చేశారు. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. విజయం సాధించాలి అంటే మనల్ని అడ్డుకోలేరు అనే విధంగా చేయాలని అన్నారు.
గాజాను పూర్తిగా ఆక్రమించుకుంటాం..ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES