- Advertisement -
నవతెలంగాణ-మునిపల్లి: వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం కొత్త బోరు మోటర్‌ను పెద్ద గోపారం గ్రామంలో సోమవారం రాయికోడ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త మోటర్ బిగించడానికి సహకరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి వారి సమస్యలను తీర్చడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు చెప్పుకొచ్చారు, ఈ కార్యక్రమంలో గోపులారం సర్పంచ్ మల్లేశం, మాజీ ఎంపీపీ తాటిపల్లి రాంరెడ్డి, మాజీ ఎంపిటిసి పాండు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



