Thursday, July 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంథాయిలాండ్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివ‌ర్గం

థాయిలాండ్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివ‌ర్గం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: థాయిలాండ్‌ కొత్త కేబినెట్‌ కొలువుతీరింది. ప్రభుత్వ గృహంలో గురువారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ప్రధాని పెటాంగ్‌టార్న్‌ షినవత్రా కూడా ఉన్నారు. ఆమె సాంస్కృతిక మంత్రిగా ప్రమాణం చేశారు. కంబోడియా మాజీ నేత హన్‌సెన్‌తో షినవత్రా మాట్లాడిన ఫోన్‌కాల్‌ లీక్‌ కావడంతో రాజ్యాంగ కోర్టు ఆమెను మంగళవారం ప్రధాని పదవి నుండి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజున థాయిలాండ్‌ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్‌ ఆమెను సాంస్కృతిక మంత్రిగా ఆమోదించినట్లు సమాచారం.

నేడు కొత్త సభ్యులతో పాటు ప్రభుత్వ గృహానికి చేరుకున్న పెటోంగ్‌టార్న్‌ నవ్వుతూ కనిపించారు. అయితే మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. థాయిలాండ్‌ రాజు ఆమోదంతో ఈ కార్యక్రమానికి తాత్కాలిక ప్రధాని సూర్య జుంగ్రుంగ్రియాంగ్కిట్‌ కొత్త మంత్రివర్గ సభ్యులకు నాయకత్వం వహించారు. సూర్య తాత్కాలిక ప్రధాని బాధ్యతలను గురువారం ఉపప్రధాన మంత్రి, అంతర్గత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫుమ్తామ్‌ వెచాయాచారుకు అప్పగించే అవకాశం ఉంది. గతేడాది పెటోంగ్‌టార్న్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఫుమ్తామ్‌ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రిగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -