నవతెలంగాణ హైదరాబాద్: విస్తృతమైన విస్తరణ ప్రణాళిక, తమ దిగ్గజపు బైక్స్ పట్ల హైదరాబాద్ కు ఉన్న క్తివంతమైన బ్రాండ్ ప్రేమ ఆధారంగా, పటాన్ చెరువులో కొత్త డీలర్ షిప్ SRK ఆటోమోటివ్ ప్రారంభించినట్లు జావా యెజ్డీ, BSA మోటార్ సైకిల్స్ ప్రకటించింది. కొంపల్లిలో అతి పెద్ద జావా యెజ్డీ, BSA డీలర్ షిప్ యొక్క గొప్ప ప్రారంభోత్సవం తదుపరి వస్తున్న కొత్త డీలర్ షిప్ బ్రాండ్స్ కోసం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒక దానిలో డిమాండ్ ను పెంచడానికి డీలర్ షిప్ సిద్ధంగా ఉంది. SRK ఆటోమోటివ్ కుటుంబంలో చేరడంతో, కంపెనీకి ఇప్పుడు నగరంలో ఎనిమిది డీలర్ షిప్స్ తో, హైదరాబాద్ లో మోటార్ సైకిల్స్ అబిమానులకు ప్రీమియం మోటార్ సైక్లింగ్ అనుభవాన్ని అందించడానికి తమ అంకితభావాన్ని ఇది సూచిస్తోంది.
ఈ సందర్భంగా, శరద్ అగర్వాల్, CBO, క్లాసిక్ లెజెండ్స్ మాట్లాడుతూ “ హైదరాబాద్ మాకు ఎంతో ప్రాధాన్యత ఉన్న నగరంగా కొనసాగుతోంది. ఇది మా బ్రాండ్స్ తో లోతైన చారిత్రక కనక్షన్ ను భాగస్వామ్యం చేస్తోంది. కొత్త మోటార్ సైక్లింగ్ ఔత్సాహికుల యొక్క వేగంగా పెరుగుతున్న సమాజాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో డీలర్ షిప్ ప్రారంభోత్సవాల వేగవంతమైన క్రమం, జావా, యెజ్డీ, BSA మోటార్ సైకిల్స్ పట్ల మా కస్టమర్లు చూపించిన ప్రేమ, నమ్మకానికి నిరూపణగా నిలిచింది. కస్టమర్లు డీలర్ షిప్ లోకి అడుగు పెట్టి నాటి నుండి రోడ్డు పైకి తమ మోటార్ సైకిల్స్ ను తీసుకువెళ్లేంత వరకు మర్చిపోలేని అనుభవాలు అందించే విధంగా SRK ఆటోమోటివ్ మమ్మల్ని సిద్ధం చేస్తుంది.”అన్నారు.

SRK ఆటోమోటివ్ జావా, యెజ్డీ, BSA మోటార్ సైకిల్స్ పూర్తి శ్రేణిని మాకు చూపిస్తుంది, సాటిలేని అమ్మకాలు మరియు ఆఫ్టర్-సేల్స్ సేవలను అందిస్తోంది. అత్యంత నైపుణ్యవంతులైన టెక్నీషియన్స్ తో ప్రత్యేకమైన సర్వీస్ సెంటర్ ద్వారా మద్దతు చేయబడుతోంది, ప్రతి రైడ్ సాఫీగా, ఉల్లాసోత్సాహాలను నిర్ధారించడం ద్వారా ఈ దిగ్గజపు బ్రాండ్స్ యొక్క వారసత్వాన్ని సమర్థించడానికి డీలర్ షిప్ వాగ్థానం చేసింది.