Sunday, May 18, 2025
Homeజోష్సామాజిక సేవకు సరికొత్త నిర్వచనం

సామాజిక సేవకు సరికొత్త నిర్వచనం

- Advertisement -

మనలో చాలా మందికి సామాజిక సేవ చేయాలనే తపన ఉంటుంది. కానీ వివిద కారణాల రీత్యా, నగరాలలో ఉండే యాంత్రిక జీవన ప్రభావం వల్ల ఏమీ చేయలేక పోయామని బాధ పడుతుంటారు. మరి కొందరిలో అది కార్యరూపం దాలుస్తుంది. ఆర్థిక సంబంధాలతో ముడిపడిన మనిషిగా కాకుండా మానవతా దక్పథం కలిగిన వ్యక్తిగా సమాజ సేవే లక్షంగా తన సత్తాను చాటుతూ ముందుకు సాగుతుంటారు. కుల వత్తి చేసుకుంటూ ఒక సదాశయం కోసం ఆవిర్భవించిన సామాజిక సంస్థే కర్పూరి ఠాకూర్‌ సామాజిక సేవా సమితి తన సేవలను మారు మూల ప్రాంతాలతో పాటు పట్టణ, జంటనగరాలలో సైతం తన సేవలను విస్తరిస్తూ పలువురు ప్రశంసలు పోందుతుంది. సమైక్వేతతో పాటు… పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఓ ప్రత్యేకతను చాటుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అశ్విని ఆంజనేయులు.
అతనిది మధ్యతరగతి కుటుంబమే అయినా తోచినంతగా సమాజ సేవ చేయాలనే తపన ‘మానవ సేవమే మాదవసేవ’ అన్న పెద్దలమాటను గౌరవిస్తూ వివిద సామాజిక సేవాకార్యక్రమాలు చేపట్టారు హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌ మండలం చైతన్య నగర్‌ కాలనీకి చెందిన అశ్విని ఆంజనేయులు. ఇతని స్వస్థలం మహబూబ్‌ నగర్‌ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి. వాయిద్య కళాకారుడు అయిన అశ్విని నర్సయ్య, ఆశమ్మల చిన్న కొడుకు. అశ్విని ఆంజనేయులు వనస్థలిపురంలో క్షౌరశాలను నిర్వహిస్తున్నారు. కుల వత్తి చేసుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ప్రజా సేవలో పాల్గొంటున్నారు. సమాజంలోని రుగ్మతలను రూపు మాపెందుకు నడుం బిగించింది. 2011లో ఎదురైన ఒక సంఘటన ఆయనను ఆలోచింపజేసింది.
ఈ జీవితం శాశ్వతం కాదు. ఎంత డబ్బు సంపాదించినా ఏదో సంతప్తి ఉండదు. నలుగురికి మన వలన చేయగలిగి మంచి ఏదైనా ఉంటే అది చేయాలి. అదే మనల్ని నిలబెడుతుందని గ్రహించాడు. ఆ ఆలోచనకు ప్రతి రూపంగా నాయీ బ్రాహ్మణ కుల మార్గదర్శి బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ ను స్పూర్తి తీసుకోని 2011లో ”కర్పూరి రాకూర్‌ సామాజిక సేవా సమితి”ని స్థాపించారు. వత్తి రూపంగా అంచెలంచెలుగా ఎదగాలంటే ఎంతో ఓర్పు అవసరం… అంతకు మించి ఎదుటి వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం అతి ముఖ్యం. ఇలా అన్నింటా సర్దుకు పోతూ క్షౌరవత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవే పరమావదిగా బావిస్తున్న క్షౌర వత్తి దారుడు అశ్విని ఆంజనేయులు. విదార్థి దశనుంచే సామాజిక సేవలో పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారు.
ఈయన ఒక వైపు క్షౌర వత్తిలో రానిస్తూ, మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మన సమాజం కోసం బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే సమాజం పురోభివద్ది సాగిస్తుందని గుర్తించి అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం, నేత్ర దానంపై ఉన్న అపోహలను తొలగించటానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యులచే అవగాహన కల్పిస్తున్నారు. కంటి, దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్యం అందేలా కషి చేశారు.
ఓటు హక్కు వినియోగంపై ప్లకార్డులతో అవగాహన కల్పించడం, దూమపానంతో కలిగే అనర్ధాల గురించి కరపత్రాలను పంపిణీ చేసి చైతన్యం కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదలకు దుస్తుల పంపిణి, ప్రముఖుల జయంతుల సందర్భంగా పాలు, పండ్లు, ఫాదర్స్‌ డే, మదర్స్‌ డే సందర్భంగా పలువురు తల్లిదండ్రులను సన్మానించడం, బాలల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్దులకు బహుమతులు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. నేత్ర దాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి రెడ్‌ క్రాస్‌ సంస్థకు సమర్పించారు. ముఖ్యమైన దినోత్సవాల సందర్భంగా అన్నదానం చేయడం, హైదరాబాద్‌ నగరంలో పలు అనాథ ఆశ్రమాలలో విద్యార్థులకు, వద్దులకు ప్రతి మంగళవాశము ఉచితంగా హెయిర్‌ కటింగ్‌ శిబిరాలు నిర్వహించడం ఆయన చేస్తున్న సామాజిక సేవల్లో చాలా భిన్నమైనదే కాదు… చాలా ప్రత్యేకమైనది కూడా. సామాజిక సేవంటే పైన చెప్పిన అన్ని కార్యక్రమాలు ఏదో మూలన ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. కానీ ఇలా అనాథ పిల్లలకు ఆశ్రమాలకు వెళ్లి మరీ క్షౌరము చేసి వారిని ఆనందంగా అందంగా తీర్చిదిద్దడం ఒక ఎత్తయితే… వద్ధాప్యంలో అవసాన దశలో ఎవరి ఆసరా లేక ఆశ్రమంలో చివరి రోజులు గడుపుతున్న వద్ధులకు నెలనెలా హెయిర్‌ కటింగ్‌, షేవింగ్‌ చేసి వారికి ఒక మనో ధైర్యాన్ని ఇవ్వడం చిన్న విషయమేమీ కాదు. ఇది కూడా సామాజిక సేవే అని సమాజానికి పరిచయం చేస్తుంది కర్పూరి ఠాకూర్‌ సామాజిక సేవా సమితి.
సేవలకు ప్రోత్సాహం
మహబూబ్‌ నగర్‌ కలెక్టర్‌ శ్రీదేవి గారి ను 2015 జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారం, సుందరద్యు విజ్ఞాన్‌ కేంద్రంలో 2017 రాష్ట్ర స్థాయి ఎన్‌.టి.ఆర్‌ ఎక్స్‌ లెన్స్‌ అవార్డు, వరంగల్‌ లో 2018 సావిత్రి పూలే రాష్ట్ర స్థాయి అవార్డు, 2018 ఉత్తమ సేవా పురస్కారం మహబుబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో, 2019 రాష్ట్ర స్థాయి స్ఫూర్తి రతం సేవా అవార్డు మాజీ తమిళనాడు గవర్నర్‌ రోశయ్య గారి చేతుల మీదుగా రవింద్ర బారతిలో, 2022 హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎ. శర్మన్‌ గారిచే సేవా పురస్కారం, 2024 విశిష్ఠ ప్రతిభ సేవా రత్న అవార్డు జస్టివ్‌ జి. చంద్రయ్య గారి చేతుల మీదుగా, 2024 తెలుగు ఫ్రైడ్‌ అవార్డు 2024 ఉగాది పురస్కారం ఉప్పల శ్రీనివాన్‌ గుప్తా చెతుల మీదుగా.
”అనాధలకు, పేదలకు సేవ చేయటంలో ఉన్న ఆనందం మరోటి ఉండదని, ప్రజాసేవే పరమావదిగా, అనాధల అభ్యున్నతి కోసం పాటు పడాలని, సమాజ హితం కోసం విస్వార్ధంగా ప్రతి పౌరుడు తోటి వారికి కొంత సహయం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు అశ్విని ఆంజనేయులు. అనాథ ఆశ్రమ నిర్వాహకులు వీరి సేవలను వినియోగించుకోవాలనుకుంటే ఈ ఫోన్‌ నెంబరు 9490600922 ను సంప్రదించవచ్చు.

  • అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -