Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన డిప్యూటీ డిఎంహెచ్వో కు సన్మానం

ఈ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన డిప్యూటీ డిఎంహెచ్వో కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలందిస్తూ ఆదర్శప్రాయంగా నిలవాలని ఇటీవల  డిప్యూటీ డిఎంహెచ్వోగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు.  పట్టణంలో ఈ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల డిప్యూటీ డిఎంహెచ్వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రవీందర్ ను చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా తమవంతుగా కృషి చేస్తామన్నారు.

డివిజన్ పరిధిలో నాణ్యమైన వైద్యంపై ప్రజలకు, రోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రవీందర్ క్రమశిక్షణతో, పట్టుదలతో వైద్యరంగంలో ఉత్తమ సేవలందిస్తూ ఈ స్థాయికి వచ్చారని అన్నారు. రోగులను ఎంతో ప్రేమగా పలకరిస్తూ వారికి నాణ్యమైన వైద్యం అందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడంలో డాక్టర్ రవీందర్ కీలకపాత్ర పోషించారన్నారు. వారి సేవలను ప్రభుత్వం గుర్తించి డిప్యూటీ డిఎంహెచ్వోగా పదోన్నతి కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మీలాంటి వైద్యుల సేవలు ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వాసుపత్రులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంగమోహన్ చక్రు,  ఫౌండేషన్ సభ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -