Thursday, October 16, 2025
E-PAPER
Homeబీజినెస్HVAC క్యాబిన్‌తో వర్క్‌మాస్టర్ 105ని ఆవిష్కరించిన న్యూ హోలాండ్ 

HVAC క్యాబిన్‌తో వర్క్‌మాస్టర్ 105ని ఆవిష్కరించిన న్యూ హోలాండ్ 

- Advertisement -

నవతెలంగాణ – జిరక్‌పూర్ : CNHలో భాగమైన న్యూ హోలాండ్ బ్రాండ్ కొత్తగా HVAC క్యాబిన్‌తో వర్క్‌మాస్టర్ 105ని ఆవిష్కరించింది. కంపెనీకి చెందిన అత్యధిక హార్స్‌పవర్ ట్రాక్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఈ కొత్తగా చేరినట్లయింది. అన్ని రకాల వాతావరణాల్లోనూ సౌకర్యవంతంగా ఉంటూ, న్యూ హోలాండ్ యొక్క 106 హెచ్‌పీ ట్రాక్టర్ శ్రేణిలో ఇది మరింత మెరుగైన పనితీరును  కనపర్చనుంది. తద్వారా ఆపరేటర్లకు సౌకర్యంపరంగా మరియు ఉత్పాదకతపరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది.

106 హెచ్‌పీ, 3.4 లీటర్ FPT (ఫియట్ పవర్‌ట్రైన్ టెక్నాలజీస్), TREM-IV ఇంజిన్ దన్నుతో తక్కువ ఆర్‌పీఎంతో (రెవల్యూషన్స్ పర్ మినిట్) వర్క్‌మాస్టర్ 105 అసాధారణ పనితీరు కనపరుస్తుంది. ఇంధనాన్ని ఆదా చేస్తుంది. HVAC క్యాబిన్‌తో ఈ కొత్త వేరియంట్ ఆరు రూఫ్ వెంట్ల హీటింగ్ మరియు ఎయిర్ కండీషనింగ్ సిస్టం సౌలభ్యంతో, అన్ని కాలాల్లోనూ సౌకర్యవంతంగా ఉంటుంది. నాయిస్-ఫ్రీ పరిస్థితులు, అలసటలేకుండా పని చేసుకునేందుకు వీలుగా ఎయిర్-సస్పెండెడ్ సీటు, కోతల అనంతరం దుమ్మూ ధూళి వాతావరణంలో కూడా నిరాటంకంగా పని చేసుకునేందుకు వీలుగా న్యూమ్యాటిక్ రివర్సిబుల్ ఫ్యాన్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా వరి పంట కోతల సమయంలో ఇది బాగా ఉపయోపడుతుంది.


“వివిధ అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ పనితీరు, అధిక శక్తి, విశ్వసనీయతకు న్యూ హోలాండ్ వర్క్‌మాస్టర్ 105 పేరొందింది. HVAC క్యాబిన్ గల కొత్త ఉత్పత్తి ఆవిష్కరణతో అన్ని కాలాల్లోనూ ఉష్ణోగ్రతలకు తగ్గట్లుగా ఏడాది పొడవునా తోడ్పడే వర్క్‌మాస్టర్ ఉత్పత్తుల శ్రేణి అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. కఠినతరమైన పరిస్థితుల్లోనూ రైతు అలసట లేకుండా మరింత సమర్ధంగా పనిచేసుకోగలిగేందుకు వీలుగా ఈ ట్రాక్టర్ రూపొందింది. సరికొత్త ఆవిష్కరణలతో భారతీయ వ్యవసాయ రంగ భవిష్యత్తును న్యూ హోలాండ్ తీర్చిదిద్దుతోంది. రైతుల సామర్థ్యాలు, సౌకర్యాలు, జీవన నాణ్యతలను మెరుగుపర్చే ప్రపంచ స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది  అని CNH ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) నరీందర్ మిట్టల్  (Narinder Mittal) తెలిపారు.

గ్లోబల్ మార్కెట్ల కోసం భారత్‌లో తయారైన మోడల్‌గా తన సత్తాను విజయవంతంగా నిరూపించుకున్న వర్క్‌మాస్టర్ 105 గతేడాది భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఇది ఇప్పుడు HVAC క్యాబిన్‌తో కూడా లభిస్తోంది. పటిష్టమైన పనితీరు, విస్తృత ఆమోదయోగ్యత దన్నుతో వర్క్‌మాస్టర్ సిరీస్ భారత్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 15,000 యూనిట్ల విక్రయాల స్థాయిని దాటింది. దానికి కొత్త వేరియంట్ కొనసాగింపుగా ఉండనుంది. ఇందులో 20 ఫార్వర్డ్ + 20 రివర్స్ పవర్ షటిల్ ట్రాన్స్‌మిషన్, పటిష్టమైన 3,500 కేజీల లిఫ్టింగ్ సామర్థ్యం ఉంటుంది. తద్వారా భారీ పనులను కూడా సులువుగా చేసేందుకు వీలవుతుంది. ఇక ఆల్-వెదర్ క్యాబిన్ అనేది కఠినతరమైన ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కల్పిస్తుంది. అదే సమయంలో మెయిన్ డ్రైవ్ మరియు పవర్ టేకాఫ్ (పీటీవో)కి సంబంధించిన కంప్లీట్ వెట్ క్లచ్ వల్ల బేలింగ్, బంగాళదుంప నాట్లు, కందకాలు వేయడంలాంటి కఠినతరమైన పనులను కూడా ధీమాగా చేసుకునేందుకు వీలవుతుంది. బేలింగ్, ఫోరేజ్ హార్వెస్టింగ్, రిగ్ అవసరాలు మొదలైన వాటి కోసం వర్క్‌మాస్టర్ 105 అనువుగా ఉంటుంది.

అమెరికా మరియు ఇతరత్రా అంతర్జాతీయ మార్కెట్లలో పటిష్ట స్థానం సంపాదించుకున్న వర్క్‌మాస్టర్ 105కి ఇప్పుడు HVAC క్యాబిన్ కూడా తోడు కావడంతో భారత్‌లోనూ గణనీయంగా డిమాండ్ ఏర్పడనుంది. భారతదేశవ్యాప్తంగా న్యూ హోలాండ్ డీలర్‌షిప్‌లలో కొత్త మోడల్ లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 35 లక్షలుగా ఉంటుంది. 3 ఏళ్లు లేదా 3,000 గంటల వారంటీ లభిస్తుంది. ఈ ఆవిష్కరణ ద్వారా అన్ని కాలాల్లోనూ సౌకర్యవంతంగా ఉంటూ, అత్యధిక శక్తి, పనితీరుతో భారతీయ రైతులకు అత్యుత్తమ హెచ్‌పీ ట్రాక్టర్ అనుభూతిని అందించే ప్రీమియం ట్రాక్టర్ల సెగ్మెంట్లో న్యూ హోలాండ్ తన అగ్రగామి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -