శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జివికె దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి పలు అందమైన లొకేషన్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ,’మా టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ ట్రెండ్‌ని దష్టిలో పెట్టుకుని దర్శకుడు జీవీకే ఓ సరికొత్త హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు’ అని తెలిపారు. ‘వీఎఫ్‌ఎక్స్‌కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. జె ప్రభాకర్ రెడ్డి విజువల్స్, సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ భరద్వాజ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హర్రర్ మూడ్‌ని క్యారీ చేస్తుంది’ అని తెలిపారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘మధ్య ప్రదేశ్ షెడ్యూల్‌లో మాకు పూర్తి సహకారం అందించిన శీలంధర్ (ఐఏఎస్), అజరు పాండే (ఎస్‌ఐ), ఎజి కుమార్ (డిస్ట్రిక్ట్ సీఇఓ)కి మా ప్రత్యేక ధన్యవాదాలు’ అని తెలిపారు.