హీరో అశ్విన్ బాబు నటిస్తున్న నూతన చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కు తున్న ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్.కష్ణ దర్శకత్వం వహిస్తు న్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్3గా రూపొందు తున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ,’టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కష్ణ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. డెఫినెట్‌గా చాలా కొత్త పాయింట్. మీరు ఊహించలేని పాయింటు. అది మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నాను. మంచు మనోజ్ వాయిస్ టీజర్‌కి ప్రాణం పోసి, మరో స్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత గణపతి రెడ్డితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’ అని అన్నారు. ‘టీజర్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం హీరో అశ్విన్ బాబు. నన్ను నమ్మి ట్రావెల్ చేశారు. అలాగే డీవోపీ బాల్ రెడ్డి, మ్యూజిక్ హరి గౌర, మా టీం అంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. అందుకే ఇంత మంచి టీజర్ వచ్చింది’ అని డైరెక్టర్ కష్ణ చెప్పారు. నిర్మాత గణపతి రెడ్డి మాట్లాడుతూ,’టీజర్ చూసిన తర్వాత గూస్‌బంప్స్ వచ్చాయి. అశ్విన్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. దర్శకుడు కష్ణ విజువల్స్‌తో టేకింగ్ అదరగొట్టారు. హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం’ అని తెలిపారు.