- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : UPSC పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ఇకపై అభ్యర్థులందరికీ ‘ఫేస్ అథెంటికేషన్’ తప్పనిసరి చేశారు. Ai టెక్నాలజీతో పనిచేసే ఈ విధానాన్ని ఇప్పటికే NDA, CDS పరీక్షల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా పరీక్షించారు. దీని వల్ల వెరిఫికేషన్ కేవలం 10 సెకన్లలోనే పూర్తవుతుందని, సమయమూ ఆదా అవుతుందని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి మోసాలకు ఫేస్ అథెంటికేషన్‌తో చెక్ పడనుంది.
- Advertisement -



