Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపోలీస్ కమిషనర్‌ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐలు

పోలీస్ కమిషనర్‌ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఐలు

- Advertisement -


నవతెలంగాణ-కంఠేశ్వర్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మంగళవారం కొత్తగా బాధ్య‌తులు స్వీక‌రించిన ప‌లువురు ఎస్సైలు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారికి పువ్వుల మొక్క‌లు అందించి పోలీస్ కమిషనర్ శుభాకాంక్షుల చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భాద్యతాయుతంగా విదులు నిర్వహించాల‌న్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. వారందరికి తగు న్యాయం చేయాలని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను నిఖచ్చిగా అమలుచేయాలని, ప్రతీ విషయం తమ పై అధికారులకు తెలియజేయాలని, ప్రతీ గ్రామాలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధానంగా సైబర్ నేరాల పై, కొత్త చట్టాలపై, మొదలగునవి ప్రజలకు అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేశారు.

నూతన ఎస్ఐలు
కళ్యాణి -దర్పల్లి పీఎఎస్‌.
సుస్మిత -ముగ్పాల్ పీఎఎస్‌.
ఎమ్.రమా -ఎడపల్లి పీఎఎస్‌.
కె.శైలెంధర్ -బాల్కొండపీఎఎస్‌.
సుహాసిని – మెండోరా పీఎఎస్‌.
పి.రాజేశ్వర్ -ఎర్గాట్ల పీఎఎస్‌.
కిరణ్ పాల్ – టౌన్ 3 పీఎఎస్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad