- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నవతెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్‌లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమానికి పద్మకమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ సంస్కృతిని నవతెలంగాణ మహిళా సిబ్బంది చాటారు. పిల్లాపాపలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు.







- Advertisement -