Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికుల సన్మానానికి కృతజ్ఞతలు తెలిపిన నూతన వార్డు మెంబర్

కార్మికుల సన్మానానికి కృతజ్ఞతలు తెలిపిన నూతన వార్డు మెంబర్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామ సమీపంలో ఉన్న గౌతమి ఎక్స్పోజింగ్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న కంతి బాలరాజు శారాజీపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 7వ వార్డు మెంబర్‌గా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కంపెనీలోని తోటి కార్మికులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కంతి బాలరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి శుభాకాంక్షలు తెలిపిన తోటి కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వార్డు సభ్యులు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ సర్పంచ్‌తో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో 7వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -