నవతెలంగాణ – ఆర్మూర్
శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ (ఖత్రి/పట్కర్) ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యములో రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ విశ్వనాధ్ రవీందర్ ఆధ్వర్యములో హైదరాబాద్ లో రాష్ట్ర కార్యాలయములో 2026 నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమము జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అఖిల భారత క్షత్రియ సమాజ్ ఉపాధ్యక్షులు విశ్వనాధ్ బాలకిషన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా Dr విశ్వనాధ్ రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సమాజ్ అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు కృషి చేస్తూ, “మిషన్ ఉథాన్” అనే బృహత్తర కార్యక్రమం చేపట్టామని, దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య, పేదరికం, నిరక్షరాస్యత రూపుమాపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం వుందని అన్నారు. మిషన్ ఉథాన్ చేపట్టిన నిర్మానాత్మక పాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 25 సం,, లోపు ఏ నిరుపేద విద్యార్థి చదువు మధ్యలో ఆపకుండా చర్యలు తీసుకున్నామని, డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేసి వారిద్వారా విద్యార్థుల ఫీజులు చెల్లించే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
క్షత్రియ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథి విశ్వనాధ్ బాలకిషన్ మాట్లాడుతూ సమాజ్ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ప్రాంతీయ సమాజ్ చేపట్టిన మిషన్ ఉథాన్ కార్యక్రమం ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమములో ప్రాంతీయ క్షత్రియ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టoక్ విష్ణు, ఉపాధ్యక్షులు పూజారి రాజేశ్వర్, మామిడి పెంటుషా, కోశాధికారి దినేష్ వైద్య, రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు విశ్వనాధ్ నర్సింహా రావు, సిరిగిరి రామ్ కిషన్ రావు, శివ పండిత్, సందీప్ సా విశ్వనాధ్, రాజ్ కుమార్ , హీరాలాల్, క్షత్రియ ప్రాంతీయ సమాజ్ మహిళా మండలి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంగీతా ఖాందేష్, క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర యూత్ కమిటీ అధ్యక్షులు విశాల్ విశ్వనాధ్, ప్రధాన కార్యదర్శి గటడి వడ్డ ప్రశాంత్, సికింద్రాబాద్ క్షత్రియ సమాజ్ కార్యదర్శి శ్యామ్ లాల్, వారి కార్యదర్శులు, సలహాదారులు , వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు…



