Wednesday, January 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలున్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు

న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ చేసింది. మత్తుపదార్థాలకు దూరంగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మద్యం తాగి వాహనాలు నడుపరాదని, పబ్‌ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించవద్దని తెలిపింది. మితిమీరిన డీజే శబ్దాలు, బ్యాండ్స్‌ను పార్టీల్లో వాడొద్దని సూచించింది. వేడుకల్లో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని తెలిపింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -