Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నారం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: సర్పంచ్

అన్నారం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
అన్నారం గ్రామ ప్రజలకు2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి. కొత్త సంవత్సరంలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తానని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు,రైతులు, యువత,అన్ని వర్గాల ప్రజలు నూతన సంవత్సరంలో పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం,గ్రామ అభివృద్ధి కోసం,పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకొని ముందుకు సాగుతానన్నారు. గ్రామంలోని అన్ని రంగాలకు చెందిన ప్రతి ఒక్కరు దినదిన అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఈ సంవత్సరంలో అందరి అభివృద్ధికి కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -