- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. ఈ విషాదకరమైన వార్తపై ఏపీ, తెలంగాణలోని ప్రముఖులు స్పందిస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అందేశ్రీ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్‌లో “ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని సీఎం చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు.
- Advertisement -



